గమ్యం

రచన: గూళూరు విష్ణువర్ధన్
1
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
కనిపించిందొక సుందర దృశ్యం
పదే పదే చూడాలంటోంది నా హృదయం
ఇంత కన్నా గమ్యం లేదనిపించిందా క్షణం
2
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
కనిపించిందొక విషాద దృశ్యం
పదే పదే చూడొద్దంటోంది నా హృదయం
అంతా భ్రాంతి యనిపించిందా క్షణం
3
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
వినిపించిందొక స్తుతి స్వరం
పదే పదే వినమంటోంది నా హృదయం
ఇంత కన్నా గమ్యం లేదనిపించిందా క్షణం
4
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
వినిపించిందొక హేళన స్వరం
పదే పదే వినవద్దంటోంది నా హృదయం
ఎంత కష్టించినా ఫలితం లేదనిపించిందా క్షణం
5
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
ఆఘ్రాణించాల్సొచ్చిందొక పరిమళ సుగంధం
పదే పదే ఆఘ్రాణించమంటోంది నా హృదయం
ఇంత కన్నా గమ్యం లేదనిపించిందా క్షణం
6
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
ఆఘ్రాణించాల్సొచ్చిందొక దుర్గంధం
పదే పదే ఆఘ్రాణించొద్దంటోంది నా హృదయం
ఇంత కన్నా నరకం లేదనిపించిందా క్షణం
7
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
రుచించిందొక మధుర పదార్థం
పదే పదే రుచి చూడమంటోంది నా హృదయం
ఇంత కన్నా గమ్యం లేదనిపించిందా క్షణం
8
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
తప్పనిసరైందొక చేదు పదార్థ సేవనం
పదే పదే సేవించొద్దంటోంది నా హృదయం
ఇంత కన్నా దౌర్భాగ్యం లేదనిపించిందా క్షణం
9
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
చక్కని అనుభూతినిచ్చిందొక స్పర్శ
పదే పదే స్పర్శించమంటోంది నా హృదయం
ఇంత కన్నా గమ్యం లేదనిపించిందా క్షణం
10
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
బాధించిందొక స్పర్శ
పదే పదే ఆ స్పర్శకు దూరం కమ్మంటోంది నా హృదయం
ఇంత కన్నా దుస్థితి లేదనిపించిందా క్షణం
11
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
కనిపించిన దృశ్యాలు - వినిపించిన శబ్దాలు
ఆఘ్రాణించిన వాసనలు - ఆరు రుచులు
అనుభూతుల్నిచ్చిన స్పర్శ
అడ్డు గోడలుగా నిలిచాయి - నిజమైన గమ్యాన్ని దూరం చేశాయి
12
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
చెప్పాలనిపించిందొక సందేశం
అనుభూతుల్ని ఆస్వాదించమని అదే గమ్యం కాదని
విషయాల అడ్డు గోడలు కూల్చమని
అప్పుడే నిజమైన గమ్యం కనబడుతుందని
13
గమ్యం వైపు దూసుకెళ్తున్న నాకు
కనిపించిందొక నిజమైన గమ్యం
------ (మాటలకందని మౌనం)
GAMYAM (The Destination)

Written by: Gooluru Vishnuvardhan
1
As I rushed towards my destination,
A beautiful sight appeared to me
My heart says to see it again and again
In that moment, it felt - there is no destination greater than this
2
As I rushed towards my destination,
A sorrowful sight appeared to me
My heart says not to see it again and again
In that moment, it felt - all is an illusion
3
As I rushed towards my destination,
A praiseful tune was heard by me
My heart says to listen to it again and again
In that moment, it felt - there is no destination greater than this
4
As I rushed towards my destination,
A mocking voice was heard by me
My heart says not to listen to it again and again
In that moment, it felt - no matter how hard I work, there is no result
5
As I rushed towards my destination,
I had to smell a fragrant perfume
My heart says to smell it again and again
In that moment, it felt - there is no destination greater than this
6
As I rushed towards my destination,
I had to smell a foul stench
My heart says not to smell it again and again
In that moment, it felt - there is no hell greater than this
7
As I rushed towards my destination,
I tasted a sweet delicacy
My heart says to taste it again and again
In that moment, it felt - there is no destination greater than this
8
As I rushed towards my destination,
I was forced to consume a bitter substance
My heart says not to consume it again and again
In that moment, it felt - there is no misfortune greater than this
9
As I rushed towards my destination,
A touch gave me a wonderful feeling
My heart says to touch it again and again
In that moment, it felt - there is no destination greater than this
10
As I rushed towards my destination,
A touch pained me
My heart says to stay away from that touch again and again
In that moment, it felt - there is no worse condition than this
11
As I rushed towards my destination,
The sights I saw - the sounds I heard
The smells I smelled - the six tastes
The touches that gave me feelings
Stood as walls in my way - and distanced me from the true destination
12
As I rushed towards my destination,
A message came to my mind to share
To enjoy the experiences, but they are not the destination itself
To break down the walls of sensory distractions
Only then will the true destination appear
13
As I rushed towards my destination,
A true destination appeared to me
------ (The silence beyond words)

